మచ్చర్ జల్ సొర్సె పాబ్డా
- July 10, 2017
కావాల్సిన పదార్థాలు:
పాబ్డా చేప - 180గ్రాములు, ఉల్లిపాయని ఉడికించిన గుజ్జు - 50గ్రాములు, టొమాటో గుజ్జు - 50గ్రాములు, పచ్చిమిర్చి - మూడు, అల్లం వెల్లుల్లి గుజ్జు - 15గ్రాములు, జీలకర్ర - ఐదు గ్రాములు, ధనియాల ముద్ద - ఐదు గ్రాములు, ఎండుమిర్చి - మూడు, పసుపు రంగు ఆవాల గుజ్జు, నలుపు ఆవాల గుజ్జు - ఒక్కోటి పది గ్రాముల చొప్పున, కొత్తిమీర - అలంకరణకు, వేగించిన జీలకర్ర పొడి - ఐదు గ్రాములు, పసుపు - మూడు గ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, ఆవ నూనె - తగినంత, పంచదార - మూడు గ్రాములు, పచ్చి మిర్చి గుజ్జు - మూడు గ్రాములు, నల్లజీలకర్ర - రెండు గ్రాములు, పచ్చిమిర్చి గుజ్జు - మూడు గ్రాములు.
తయారీ విధానం:
చేపను శుభ్రంగా కడిగి రెండు వైపులా ఉప్పు, పసుపు వేసి నానబెట్టాలి.
తరువాత ముక్క మునిగే నూనె పోసి అందులో నానబెట్టిన ముక్కల్ని వేగించాలి.
ఒక పాత్రలో నూనె వేడి చేసి నల్ల జీలకర్ర వేయాలి. అవి చిటపట అంటున్నప్పుడు ఉల్లిపాయ, టొమాటో, అల్లంవెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చిల గుజ్జు వేయాలి. పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కొద్దిసేపు వేగించాలి.
ఠ ఆ తరువాత ఆవగుజ్జు వేసి పావు గంట ఉడికించాక చేప వేయాలి. దానిపైన వేగించిన జీలకర్రపొడి, కొత్తిమీర తరుగు వేసి అలంకరించాలి. దీన్ని కూడా అంతే హాట్ హాట్‌గా తింటే యమ్మీ యమ్మీగా ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









