'దర్శకుడు' చిత్ర పాటను ఆవిష్కరించిన హీరోయిన్ సమంత
- July 11, 2017
వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మించిన తొలిచిత్రం కుమారి 21 ఎఫ్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సుకుమార్ నిర్మాతగా తన సొంత సంస్థలో నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రం లోని 'సండే టు సాటర్డే లవ్' అనే పాటను ప్రముఖ కథానాయిక సమంత రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ ప్రేమకు, తపనకు మధ్య నలిగిపోయే ఓ దర్శకుడి ప్రేమకథ ఇది. స్వార్థపరుడైన దర్శకుడు ప్రేమలో పడితే ఏం జరుగుతుందనే సినిమాలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సాయికార్తీక్ అందించిన పాటలను ఒక్కొక్కటి విడుదల చేసి.. ఆ తర్వాత పూర్తి ఆడియోను ఈ నెల 15న ప్రముఖ కథానాయకుడి చేతుల మీదుగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆల్రెడీ ఓ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం లోని 'సండే టు సాటర్డే లవ్' అనే పాటను ప్రముఖ కథానాయిక సమంత గారి చేతుల మీదుగా రిలీజ్ చేశాము. ఈ పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. అలాగే అశోక్ నటన, హరి ప్రసాద్ జక్కా దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి అని తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







