శేఖర్ కమ్ముల 'ఫిదా' ఆడియో రిలీజ్
- July 11, 2017
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్-సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం 'ఫిదా'.శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ స్వరాలు సమకూర్చారు.తాజాగా సోమవారం రాత్రి ఈచిత్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ " ఈ చిత్రాన్ని ఎంతో జాగ్రత్తగా అన్ని హంగులతో తెరకెక్కించాం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన 'తొలిప్రేమ' చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ఎలా ఫీల్ అయ్యారో ఈచిత్రం కూడా ప్రేక్షకుల్లో అదే ఫీలింగ్ తెస్తుంది.సినిమా తొలిప్రేమ,సుస్వాగతం అంతటి ఘనవిజయం సాధిస్తుంది అని తెలుపుతూ..ఈసినిమాను యువత ఎన్నటికీ మరచిపోలేరు అన్నాడు.వరుణ్ తేజ్ లో మెగా బ్రదర్స్ నటనలోని అన్ని షేడ్స్ కనిపిస్తాయి.సాయిపల్లవి ఆధ్బుతమైన నటి,డాన్సర్.ఈ సినిమా ద్వారా తానేంటో రుజువు చేసుకుంటుంది సాయిపల్లవి. చాలాకాలం తర్వాత సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నా..ఖచ్చితంగా ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్ లో గొప్ప చిత్రం కాబోతుంది అన్నాడు.తెలంగాణా లోని బాన్సువాడలో షూటింగ్ చేస్తున్నపుడు అక్కడి ప్రజల సహకారం సంతోషాన్నిచ్చింది" అని తెలిపాడు.
సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్,పోస్టర్ లు ప్రేక్షకలోకాన్ని బాగా ఆకట్టుకున్నాయి.దీంతో ఈ సినిమా వరుణ్ తేజ్ కి టర్నింగ్ కావడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







