అమెరికాలో విమాన ప్రమాదం.. మచిలీపట్నం డాక్టర్ దంపతుల దుర్మరణం
- July 12, 2017
అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన దంపతులు మృతి చెందారు. బెవర్లీలోని వాషింగ్టన్ కౌంటీ విలేజ్ సమీపంలో సరస్సులో చార్డెడ్ విమానం కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
మృతులు మచిలీపట్నానికి చెందిన కల్పాటపు ఉమామహేశ్వర రావు(63), సీతాగీత(61)గా గుర్తించారు. 40 ఏళ్ల క్రితమే ఇండియానా రాష్ట్రంలోని లోగన్ స్పోర్ట్ లో స్థిరపడిన ఉమామహేశ్వర రావు దంపతులు అక్కడే రాజ్‌హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు.
ఉమామహేశ్వర రావు, సీతాగీత ఇద్దరూ గుంటూరు వైద్య కళాశాలలో విద్యనభ్యసించారు.
శనివారం ఇండియానాలోని కాస్ కౌంటీ నుంచి వీరి విమానం బయలుదేరిందని, చివరిసారిగా ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పశ్చిమ వర్జీనియాలోని పార్కెర్స్ బర్గ్ సమీపంలో ఉన్న ఎయిర్ పోర్టుతో కూడా కాంటాక్ట్ అయ్యారని, మధ్యాహ్నానికి విమానం కనిపించకుండా పోయిందని అధికారులు పేర్కొన్నారు.
శనివారం మధ్యాహ్నం ఓ సరస్సు ఓడ్డున వీరి విమాన శకలాలను గుర్తించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలేమీ తెలియరాలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మరియు నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!







