ఇకపై యూ. ఏ. క్యూ. ట్రాఫిక్ జరిమానా లపై 50 శాతం తగ్గింపు
- October 18, 2015
ఉమ్మ్ అల్ క్యూవైన్ లో ట్రాఫిక్ జరిమానా లపై 50 శాతం తగ్గింపు ఇచ్చే మూడు నెలల డిస్కౌంట్ స్కీం ఈ శనివారం నుండి మొదలై డిసెంబర్ 3 వరకు కొనసాగుతుందని ఇక్కడి పోలీస్ డైరక్టరేట్ జనరల్ యొక్క ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డైరక్టర్ - సయీద్ ఒబైద్ బిన్ అరన్ తెలిపారు. ఈ పధకం- అధిక వేగం మరియు ఇతర ట్రాఫిక్ అతిక్రమణలకు వర్తిస్తుందని, జరిమానా దేశవ్యాప్తంగా ఉన్న ఏదైన సర్వీస్ సెంటర్లోనైనా చెల్లించవచ్చని ఆయన వివరించారు. నూతన విద్యా సంవత్సరం మొదలైన నేపధ్యంలో, ప్రజల భద్రత కోసం మరిన్ని ట్రాఫిక్ గస్తీని మరింత పెంచామని, విచక్షణా రహితంగా సంచరించే చోదకులకు 2000 దిర్హమ్ లు, 12 బ్ల్యాక్ పాయింట్లు మరియు 30 రోజుల వాహన స్వాధీనం జరిమానాగా విధించబడుతుందని, డైవింగ్ లైసెన్స్ లేకపోయినా హార్న్ ను అంతరాయం కలిగించేలా ఉపయోగించినా 100 దిర్హమ్ లు జరిమానా విధించబడతాయని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







