రామ్ చరణ్ చేతుల మీదుగా 'దర్శకుడు' ఆడియో
- July 14, 2017
ప్రేమ కథ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే సుకుమార్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రంగస్థలం 1985 అనే మూవీ చేస్తున్న సంగతి తెల్సిందే..దీంతో పాటే దర్శకుడు అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 4 న రిలీజ్ కు సిద్ధం చేసారు. ఈ నేపథ్యం లో చిత్ర యూనిట్ ప్రచార కార్య క్రమాలను మొదలు పెట్టింది.
ఇక ఈ నెల 15 న ఆడియో వేడుక ను గ్రాండ్ గా జరపడానికి సుకుమార్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ ఆడియో కు ముఖ్య అతిధిగా రామ్ చరణ్ రాబోతున్నాడు. ఇంతకుముందు కూడా ఈ సినిమా యొక్క పాటల్ని సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ల వంటి స్టార్ హీరోయిన్ల చేత లాంచ్ చేయించారు సుకుమార్. హరిప్రసాద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుకుమార్ అసిస్టెంట్ అశోక్ కథానాయకుడి పాత్ర పోషించాడు. గతం లో సుకుమార్ కుమారి 21 ఎఫ్ చిత్రం నిర్మించి మంచి లాభాలను చవిచూశాడు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







