సౌదీ అరేబియాలో స్కర్ట్ వేసుకున్న యువతి అరెస్ట్
- July 19, 2017
ముస్లిం దేశాల్లో మహిళలకు కట్టుబాట్లు ఉంటాయి. వారు ధరించే దుస్తుల దగ్గర్నుంచి చేసే పనుల వరకు అన్నింటికీ నిబంధనలుంటాయి. సౌదీ అరేబియాలో ఓ యువతి స్కర్ట్ ధరించి కన్పించింది. నిర్మానుష్యంగా ఉన్న వీధిలో ఈ యువతి నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో, ఆ మహిళను సౌదీ పోలీసులు అరెస్టు చేశారు. ఓ యువతి స్కర్ట్, క్రాప్‌టాప్ ధరించి నిర్మానుష్యంగా ఉన్న ఓ గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ కన్పించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో ప్రత్యక్షమైంది. వీడియోలో ఎక్కువ సేపు యువతి వెనక్కు తిరిగే ఉంది.
ఒకటి రెండు సార్లు మాత్రమే ఆమె ముఖాన్ని కెమెరాకు చూపించింది. అయితే యువతి కన్పించిన ప్రదేశాన్ని కొందరు నెటిజన్లు గుర్తించారు. అది సౌదీ అరేబియా రాజధాని రియాద్ శివారులోని చారిత్రక ఉషౌఖిర్‌గా చెప్పారు. అక్కడికి చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. ఈ విషయం కాస్తా రియాద్ పోలీసుల దాకా వెళ్లడంతో వారు వెంటనే చర్యలు చేపట్టారు.
సదరు యువతిని గుర్తించి అరెస్టు చేసినట్టు సౌదీ అధికారిక మీడియా పేర్కొంది. ఆమెను కోర్టులో హాజరుపర్చనున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







