తమిళ హీరో ఉదయనిధి చిత్రానికి యు సర్టిఫికెట్
- July 19, 2017
ఇటీవల వరుస విజయాలను అందుకుంటున్న యువ నటుల్లో ఉదయనిధి స్టాలిన్ ఒకరు. ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన సవరణన్ ఇరుక్క భయమేన్ చిత్రం ప్రేక్షకాదరణను పొందింది. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం పొదువాగ ఎన్ మనసు తంగం. మదురై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఉదయనిధిస్టాలిన్ గ్రామీణ యువకుడిగా కనిపించనున్నారు. ఆయనకు జంటగా నివేదాపేతురాజ్ నటించారు. ఇందులో పార్థిబన్, సూరి, మయిల్‌స్వామి ముఖ్యపాత్రలు పోషించారు.
దళపతి నవదర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. డి.ఇమాన్ సంగీతాన్ని, బాలసుబ్రమణియం ఛాయాగ్రహణం అందించారు. తేని, మదురై, కోవై, సత్యమంగళం ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుని యూ సర్టిఫికెట్తో విడుదలకు సిద్ధం రెడీ అయ్యింది. చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రం పూర్తి కావడంతో ఉదయనిధిస్టాలిన్ తాజాగా ప్రియదర్శన్ దర్శకత్వంలో నటించే చిత్రంపై దృష్టి పెట్టారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







