94 ఫుడ్ ఔట్లెట్స్ మూసివేత
- July 20, 2017
2017 తొలి అర్థ భాగంలో దుబాయ్ మునిసిపాలిటీ 94 ఫుడ్ ఔట్లెట్స్ మూసివేతకు నిర్ణయం తీసుకుంది. పరిశుభ్రత లేమి కారణంగా వీటిని మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. అతి తక్కువ సమయంలోనే ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ పూర్తిస్థాయి పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా దుబాయ్ మునిసిపాలిటీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ - ఫుడ్ ఇన్స్పెక్షన్ సెక్షన్ హెడ్ సుల్తాన్ అల్ తహెర్ అల్టిమేటం జారీ చేశారు. ఇంకో వైపున 1,409 ఫుడ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కి ఎక్స్లెంట్ మరియు గోల్డ్ రేటింగ్‌ని దుబాయ్ మునిసిపాలిటీ అందజేసింది. మొత్తం 15,681 తనిఖీలు నిర్వహించారు. చిన్న చిన్న ఉల్లంఘనలకు సంబంధించి నోటీసులు అందజేశామనీ, వారికి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగిందనీ, పెద్ద ఉల్లంఘనల విషయంలో రాజీ పడేది లేదని తహెర్ చెప్పారు. ముందు ముందు ఇంకా ఉధృతంగా తనిఖీలు జరుగుతాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







