సౌదీ అరేబియాలో అష్టకష్టాలు పడుతున్న ఏ.పి మహిళ
- July 20, 2017
విశాఖ గాజువాకకు చెందిన ఓ మహిళ సౌదీలో అష్టకష్టాలు పడుతోంది. ఉపాధి కోసం అక్కడికి వెళ్లిన ప్రవీణను యజమాని హౌస్ అరెస్ట్ చేశాడు. దారుణంగా వేధిస్తున్నాడు. ఈ వేధింపులు తట్టుకోలేక చివరికిలాగో అతికష్టంమీద ఆమె తన భర్తకు వాట్సప్‌లో వీడియో మెసేజ్ పంపింది. తనకు ఆరు నెలలుగా నరకం చూపిస్తున్నారని కన్నీరు పెట్టింది. తండ్రి చనిపోయినా విశాఖ పంపకుండా చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తన ప్రాణాలు నిలబెట్టాలని వేడుకుంది. ప్రవీణ భర్త ఈ సౌదీ దారుణాన్ని సీపీ యోగానంద్ దృష్టికి తెచ్చారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో, బాధితురాలిని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు పోలీసుల ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







