డ్రగ్స్ పై హీరో గోపీచంద్ కామెంట్స్
- July 20, 2017
డ్రగ్స్ వ్యవహారంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు సిట్ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పలువురు సినీ ప్రముఖులు దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా హీరో గోపీచంద్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒత్తిడిని అధిగమించే నిమిత్తం డ్రగ్స్ కు అలవాటుపడ్డారని చెప్పడం చాలా సిల్లీగా ఉందని అన్నాడు గోపీచంద్ .
ఒత్తిడిని అధిగమించేందుకు ఎక్సర్ సైజు చేయడమో, కాసేపు నడవడమో, లేకపోతే, ఓ పుస్తకం చదవడమో, అదీ కాకపోతే ఓ సినిమాకు వెళ్లడమో .. ఇలా చాలా మార్గాలను అవలంబించవచ్చని. అంతేకానీ, డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం కరెక్టు కాదని చెప్పాడు గోపి. ఆధారాలు లేకుండా సినీ ఇండస్ట్రీ వాళ్లే డ్రగ్స్ కు అలవాటుపడ్డారని అనడం సబబు కాదని అనవసరమైన ఆరోపణల ద్వారా వారి కుటుంబాలు దెబ్బతింటాయిని అభిప్రాయపడ్డాడు
గోపీచంద్ తాజా చిత్రం గౌతమ్ నంద విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా వున్నాడు గోపిచంద్.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







