శరత్ కుమార్ కుమార్తె హీరోయిన్ వరలక్ష్మితో పెళ్లి ఫిక్స్ చేసిన విశాల్
- July 20, 2017
హీరో విశాల్, శరత్ కుమార్ కుమార్తె హీరోయిన్ వరలక్ష్మి. వీరిద్దరూ ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. వీళ్ళు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గుసగుసలు వినిపిస్తుంటాయి. అయితే శరత్‌కుమార్‌తో గొడవల కారణంగానే విశాల్ వరలక్ష్మికి దగ్గర కాలేకపోతున్నాడని వినిపిస్తుంటుంది.
ఐతే ఆ మధ్య వీరి బ్రేక్ అప్ వార్తలు కూడా వచ్చాయి. " ఓ వ్యక్తి ఏడేళ్ల బంధాన్ని తేలిగ్గా వదులుకున్నాడు. ఆ విషయాన్ని ఆ అమ్మాయికి తన మేనేజర్ ద్వారా తెలియజేశాడు. ప్రపంచలో ప్రేమ ఏమైపోతోందో? 'అంటూ ఆ మధ్య ఓ ట్వీట్ చేసింది వరు. ఇది ఖచ్చితంగా విశాల్ గురించే అని, వీరు విడిపోయారని మాట్లాడుకున్నారు అంతా. అయితే మరుసటి రోజే మరో ట్వీట్ పెట్టింది వరు. గతంలో పెట్టిన ట్వీట్ తనగురించి కాదని. దీంతో మేటర్ సైలంట్ అయ్యింది.
అయితే ఇప్పుడు మరోసారి వరు ప్రస్తావన తెచ్చాడు విశాల్. మిష్కన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'తుప్పరివాలన్' చిత్రంలో నటిస్తున్నాడు విశాల్ . ఈ చిత్రం టీజర్ విడుదల సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో విశాల్ మాట్లాడుతూ.. లక్ష్మీ దేవి లాంటి అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు విశాల్. దింతో ఆ లక్ష్మి .. వరలక్ష్మినే అని అంతా ఫిక్సయిపోతున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







