చికెన్ ఖాస్
- July 21, 2017
కావలసినవి: ఒక కేజీ కోడి, 150 గ్రాముల వెన్న, పావుకేజీ ఉల్లిపాయలు, రెండు మూడు స్పూన్ల కారం, రెండు టేబుల్ స్పూన్ల టమోటా కెచప్, పావుకేజీ తాజా క్రీమ్, తగినంత ఉప్పు
ఎలా చేయాలి
చికెన్‌ను పెద్ద ముక్కలుగా కోసుకుని కడిగి పెట్టుకోండి. దానిలో రెండు కప్పుల నీళ్ళు, ఉప్పు వేసి ఉడికించండి. ఉడికాక మిగిలిన నీళ్ళను పక్కన తీసి పెట్టుకోండి. కడాయిని పొయ్యి మీద పెట్టి వెన్నవేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు మొత్తం వేసి వేగించండి. సగం పక్కన పెట్టి మిగతా సగంలో చికెన్, కారం, టమోటా కెచప్ వేయండి. బ్రౌన్ రంగు వచ్చేదాకా వేగించి మిగిలిన చికెన్ నీళ్ళలో క్రీం కలిపి దానిలో వేయండి. పక్కన పెట్టిన వేగించిన ఉల్లిపాయల్ని కూరమీద చల్లండి. దీన్ని నాన్లు, పరోటాలతో కలిపి తింటే బాగుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









