జీవితంలో చీకటి కోణాలను బయటపెట్టిన షకీలా
- July 23, 2017
మలయాళి నటి షకీలా తన జీవితం గురించి సమయం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటుంది. తన జీవితం మీద ఆమె ఓ పుస్తకాన్ని రాయడానికి కూడా సిద్ధపడింది. సినిమాల ద్వారా తానుసంపాదించిన డబ్బంతా తనకుటుంబసభ్యులు కాజేస్తే, మరికొందరు తనను దారుణంగా కొట్టి హింసించారని చెబుతోంది. తనుజీవితంలో మొత్తం 20 మందినిప్రేమించాననీ, వేరు వేరు కారణాలతో వారంతా తనకు దూరం అయ్యారని అంటోంది. వారిలో చాలా మంది తన మీద తరచూ చేయి చేసుకునేవారనీ, ఆఖరికి షూటింగ్లో తన సహనటి సిల్క్ స్మిత కూడా తన మీద చేయి చేసుకుందని వివరించింది. ఓ సినిమాలో తాము ఇద్దరం కలిసి నటించేసన్నివేశంలో స్మిత తను కొట్టవలసిన సీను ఉందనీ, ఆసమయంలో స్మిత తననునెమ్మదిగా కొట్టినట్టు నటిస్తుందని అనుకుంటే, గట్టిగా కొట్టిందని అంటోంది. ఆ తరువాత తనకు ఓ చాక్లెట్ బాక్స్ ఇచ్చి కూల్ చేసిందట! అయితే షకీలాకు సినిమాలు లేక, తనని ఎవరూ పట్టించుకోవడం లేదన్న డిప్రెషన్‌తో ఇలా మాట్లాడుతోందని మాలీవుడ్ జనాలు అంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక







