హీరోయిన్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన వరుణ్ తేజ్
- July 23, 2017
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్స్ కు హెచ్చరికలు ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ న్యూస్ గా మారింది. వరుణ్ తేజ్ తన కెరియర్ లో మొట్టమొదటి విజయాన్ని 'ఫిదా' ద్వారా చూడటంతో మంచి జోష్ పై ఉన్నాడు మూడేళ్ల తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అందరి అంచనాలను మించి సక్సస్స్ కావడంతో ఈ సినిమా యూనిట్ సంబరాలు చేసుకుంటోంది.
హీరోయిన్ సాయి పల్లవి తన తెలుగులో తొలి సినిమాతోనే ఘన విజయం అందుకోవడంతో పాటు తెలంగాణ యాసలోమళయాళ అమ్మాయి సాయి పల్లవి డైలాగులు చెప్పిన విధానం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా సాయి పల్లవి వరుణ్ తేజ్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
ఈ మీట్ లో సాయి పల్లవి పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తనకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన శేఖర్ కమ్ములకు థ్యాంక్స్ చెప్పాలి అంటూ ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇదే సందర్భంలో వరణ్ తేజ్ మాట్లాడుతూ బయట తన స్నేహితులంతా తన కంటే పల్లవి గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారని అది తనకు సంతోషంగా ఉందని అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి పల్లవి వస్తోంది మిగతా హీరోయిన్లందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ స్వీట్ వార్నింగ్ తో జోక్ చేసాడు. దీనికితోడు మీడియా క్రిటిక్స్ అంతా సాయి పల్లవిని ఒకనాటి సౌందర్యతో పోలుస్తూ చేస్తున్న హడావిడి ఒక విధంగా టాప్ హీరోయిన్స్ కు కలవర పాటుకు గురిచేసే అంశం అనే అనుకోవాలి. అయితే ఈసినిమాకు 'ఎ' సెంటర్లలో రెస్పాన్స్ బాగుంది. అదేవిధంగా ఓవర్సీస్ లో కూడా మంచి కలక్షన్స్ వస్తున్నాయి.
అయితే ఈ సినిమాకు మన తెలుగు రాష్ట్రాలలోని బిసి సెంటర్లలో కలక్షన్స్ అంత సంతృప్తిగా లేవు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఈరోజుతో ముగుస్తున్న వీకెండ్ తరువాత 'ఫిదా' ఏ రేంజ్ హిట్ లో సెటిల్ అవుతుంది అన్న విషయం పై క్లారిటీ వస్తుంది అని అంటున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







