తెలంగాణ ప్రజా సమితి ఖతార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- July 23, 2017


దోహా,ఖతార్ : తెలంగాణ ప్రజా సమితి ఖతార్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉచిత వైద్య శిబిరం తేదీ 21-07-2017 రోజున అల్ సుల్తాన్ మెడికల్ సెంటర్ లో ఐసీసీ, మరియు ఐసీబీఎఫ్ వారి సహకారంతో నిర్వహించబడినది.
గల్ఫ్ దేశాలలో ఉండే వేసవి కాలం ఎండ వేడిమి, పని ఒత్తిడి, మరియు ఇతర సమస్యల వల్ల బాధపడే వారు మరియు ముందస్తు జాగ్రత్తగా వైద్య పరీక్షలు చేయించుకోదలచిన అనేక మంది తెలంగాణ ప్రవాస కార్మికులు పాల్గొని విజయవంతం చేశారు. మరియు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని వైద్య పరీక్షలు చేపించుకోడానికి వచ్చిన తెలంగాణ ప్రవాస కార్మమికులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ICC అధ్యక్షురాలు శ్రీమతి మిలన్ అరుణ్ గారు, సభ్యత్వ కార్యదర్శి శ్రీ ప్రసాద్ కోడూరి, ICBF అధ్యక్షుడు శ్రీ డేవిస్ ఎడుకులతుర్ గారు , కార్యదర్శి శ్రీ మహేష్ గౌడ గారు ముఖ్య అతిధులుగా పాల్గొని తెలంగాణ ప్రజా సమితి ఖతార్ కార్యవర్గం తెలంగాణా కార్మికులకు చేస్తున్న నిర్విరామ సేవలను కొనియాడారు.ఈ సంధర్భంగా కార్మికులకు రక్త, షుగర్ మరియు వివిధ వైద్య విపుణులతో ఉచిత పరీ్క్షలు నిర్వహించారు.
అల్ సుల్తాన్ మెడికల్ సెంటర్ జనరల్ మేనేజర్ శ్రీ అక్రమ్ గారు మాట్లాడుతూ కార్మికుల ఆర్ధిక పరిస్తితులకు అనుగుణంగా తక్కువ ధరలకే నాణ్యమైన వైద్యం అందించుటకు తమ వంతుగా మెంబర్షిప్ కార్డులు జారీ చేస్తున్నామని తెలిపారు.దీంతో కార్మికులు 30 రియాల్ లకే కన్సల్టేషన్ మరియు మందుల పై 15% డిస్కౌంట్ పొందగలరని తెలిపారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం ద్యేయంగా పని చేస్తున్న తెలంగాణ ప్రజా సమితి ఖతార్ ఇక ముందు మరెన్నో సేవ, సాంస్కృతిక కారక్రమాలు చేపడుతుంది అని కార్యవర్గం పేర్కొంది.
--(రాజ్ కుమార్ వనంబత్తిన,మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)





తాజా వార్తలు
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!







