ఇబ్బందుల్లో తరుణ్..!!!
- July 23, 2017
డ్రగ్స్ వ్యవహారంలో నటుడు తరుణ్ ను 13 గంటలు విచారించడం షాకింగ్ న్యూస్ గా మారింది. నిన్న శనివారం ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 11.45 గంటల వరకు సిట్ అధికార బృందం విచారించారు. ఈ విచారణలో అన్ని కోణాల్లో తరుణ్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తాను డ్రగ్స్ వాడనని తనకు ఇందులో ఏమాత్రం ప్రమేయం లేదని చాలాకాలంగా తాను సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నానని తరుణ్ చెప్పాడని టాక్. అయితే తమ వద్ద తరుణ్ మాట్లాడిన ఫోన్ సంభాషణలు వాట్సాప్ వివరాలు ఆధారంగా చూపించడంతో తరుణ్ షాక్ అయినట్లు టాక్.
దీనితో పొరపాటున గతంలో ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నానేమో కానీ ఇప్పుడయితే అలవాటు లేదని తరుణ్ చెప్పాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు తాను డ్రగ్స్ బానిసను కాదని చెప్పాడని సమాచారం. ఇదే సంధర్భంలో తరుణ్ మాట్లాడుతూ తానూ ఆర్థికంగా బలహీనంగా ఉన్నానని మనసు మనసులో లేదని ఉద్వేగానికి గురి అయినట్లు టాక్.
గతంలో తరుణ్ పబ్బు మూసివేయడానికి గల కారణాలు గురించి సిట్ అధికారులు ఆరా తీసినట్లు టాక్. అయితే కెల్విన్‌తో సంబంధాలపై ఆధారాలతో సహా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పేందుకు తరుణ్ తడబడినట్లుగా తెలుస్తోంది. చాలా వాటికి సమాధానం చెప్పినప్పటికీ కొన్ని చిక్కు ప్రశ్నలకు పొడి పొడి సమాధానాలు చెప్పాడని తెలుస్తోంది. అయితే ఇదే సందర్భంలో డ్రగ్ తన పబ్బులోనే కాదని చాలా పబ్బుల్లో కనిపిస్తుందని చెబుతూ కొన్ని పబ్బుల గురించి తరుణ్ చెప్పాడని తెలుస్తోంది. తన కుటుంబానికి చెడ్డపేరు వస్తుందనే తన పబ్బు మూసివేసినట్లుగా తరుణ్ చెప్పాడని సమాచారం.
తమది సాంప్రదాయ కుటుంబమని డీసెంట్ ఫ్యామిలీ అని ఎలాంటి చెడు అలవాట్లు కూడా తనకు లేవని చెపుతూ తరుణ్ పదేపదే ఉద్వేగానికి లోను అయ్యడని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా తరుణ్ వల్ల కూడ కొంత కీలిక సమాచారం సిట్ అధికారులకు అందినట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







