అమలు కాని ప్రభుత్వ హామీలు ఏడాది క్రితం తప్పిపోయిన ఎఎన్‌ 32 విమానం

- July 24, 2017 , by Maagulf
అమలు కాని ప్రభుత్వ హామీలు ఏడాది క్రితం తప్పిపోయిన ఎఎన్‌ 32 విమానం

ఏడాది క్రితం చె న్నై నుంచి అండమాన్‌కు బయలు దేరిన ఎఎన్‌ 32 విమానం కనిపించకుండా పోయింది. టేకాఫ్‌ అయిన 16 నిమిషాల్లోనే విమానం ఆచూకీ లేకుండా పోయింది. అన్ని విభాగాల అదికారులు గాలింపు చర్యలు చేపట్టినా విమానం ఆచూకీ లభించలేదు. దీంతో.. విమానంలో ప్రయాణిస్తున్నవారంతా మరణించినట్లు అదికారులు దృవీకరించారు. విమానంలో దాదాపు 29 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 8 మంది విశాఖ పట్టణానికి చెందిన వారున్నారు. ఘటన జరిగి ఏడాది దాటినా కేంద్ర ప్రభుత్వం బాదితులకు సహాయమందించడంలో విఫలమయింది. విశాఖకు చెందిన నాగేంద్రరావు, సాంబమూర్తి, భూపేంద్రసింగ్‌ ,ప్రసాద్‌బాబు, పూర్ణచంద్ర, చరణ్‌, చిన్నారావు, శ్రీనివాసరావు అనే 8 మంది ఎన్‌ఏడి ఉద్యోగులు పోర్ట్‌బెయిర్‌లోని యుద్ధ నౌక మరమ్మత్తుల కోసం ఇంటి నుంచి బయలుదేరిన వారు తిరిగి ఇంటికి చేరలేదు. గత సంవత్సరం 22 వ తేదీన ఎఎన్‌ 32 విమానంలో చెన్నై నుంచి పోర్ట్‌ బ్లెయిర్‌ బయలు దేరారు. అయితే వీరు ఎక్కిన విమానం మధ్యలోనే ఆచూకీ తప్పిపోవడంతో.. అదికారులు సబ్‌మెరైన్‌లు,15షిప్పులు,అత్యాధునిక పరికలరాలతో గాలింపు చర్యలు 
చేపట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో నెలరోజుల తర్వాత విమానంలో ప్రయాణించిన వారంతా మరణించి ఉంటారని భావించిన అదికారులు మరణదృవీకరణ పత్రాలను మృతుల కుటుంబాలకు అందించారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 5 లక్షలు పరిహారంగా 
అందించారు. అయితే..బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం మాత్రం ఇంత వరకు అందలేదు. బాధిత కుటుంబాలను పరార్శించిన  ఎస్‌పి ఛీఫ్‌ బాధితులకు పరిహారంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఆ హామీలు ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. పరిహారం.ఇంటికో ఉద్యోగంపై కేంద్ర ప్రభుత్రం  ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన తాము పుట్టెడు కష్టాల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com