అతి పెద్ద కిడ్నీ తొలగింపు: దుబాయ్ హాస్పిటల్ అరుదైన రికార్డ్
- July 24, 2017
ప్రపంచంలోనే అతి పెద్ద కిడ్నీని తొలగించడం ద్వారా దుబాయ్ హాస్పిటల్ అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకుంది. 56 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తికి సర్జరీ జరిగింది. ఇప్పటిదాకా 4.25 కిలోల బరువున్న కిడ్నీని వైద్యులు తొలగించారు. అదే రికార్డ్. ఆ కిడ్నీ డయామీటర్ 32 I 17 సెంటీమీటర్లు. తాజాగా దుబాయ్ హాస్పిటల్‌లో తొలగించిన కిడ్నీలు చెరో 6 కిలోలకు పైనే ఉందనీ, మొత్తంగా రెండూ కలిసి 13కిలోలు ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇంత పెద్ద కొడ్నీలని విజయవంతంగా తొలగించినందుకుగాను యూరాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ఫరిబోర్జ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్‌ని అందుకున్నారు. బాధితుడికి రెండేళ్ళ క్రితమే కిడ్నీలు పాడయ్యాయనీ, అప్పటినుంచి హిమోడయాలసిస్‌పై జీవనం సాగిస్తున్నాడని వైద్యులు చెప్పారు. కిడ్నీల తొలగింపుతో సరికొత్త రికార్డ్ సృష్టించడం ఆనందంగా ఉందనీ, వైద్య రంగంలో తాము సాధించిన ఈ ఘనత ప్రత్యేకమైనదని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







