అల్ అక్సా మసీదు ఆవరణలో ఇజ్రాయిల్ యూదీకరణ
- July 27, 2017
- అడ్డుకునేందుకు తక్షణ జోక్యం
- ప్రపంచ దేశాలకు హమాస్ పిలుపు
జెరూ సలేమ్ పాత నగరంలోని అల్ అక్సా మసీదు ఆవరణలో ఇజ్రాయిల్ ప్రభుత్వం అనుసరిస్తున్న యూదీకరణ విధానాలను అడ్డుకునేందుకు తక్షణ జోక్యం చేసుకోవాలని పాలస్తీనాకు చెందిన హమాస్ ప్రతిఘటనోద్యమ సంస్థ ముస్లిం దేశాలతో పాటు, ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఈ పవిత్ర స్థలంలో తాజాగా యధాతథ స్థితిని కొనసాగించేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోందని హమాస్ ప్రతినిధి హుసామ్ బద్రన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మసీదు సింహద్వారం వద్ద వున్న చారిత్రక శిలా ఫలకాలను, అరబిక్ భాషలో వున్న నామ ఫలకాన్ని ఇజ్రాయిల్ తొలగించటాన్ని ఈ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ముస్లింల పవిత్ర స్థలాలను, ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు జెరూసలేమ్ అల్ కుడ్స్‌లో నివసిస్తున్న పాలస్తీనా యువత గణనీయమైన త్యాగాలు చేసిందన్నారు. ఈ త్యాగ ఫలాలను సాధ్యమైనంత మేర కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని బద్రన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అల్ మక్సా మసీదు ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్లను మంగళవారం తొలగించిన ఇజ్రాయిల్ ప్రభుత్వం, మసీదులోకి వచ్చి వెళ్లే ముస్లిం భక్తులను పరిశీలించేందుకు నిఘా కెమెరాలను మాత్రం ఇంకా కొనసాగిస్తూనే వుంది.
తాజా వార్తలు
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?









