నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- February 26, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది.గురువారం ఉదయం 11 గంటలకు అధికారికంగా నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, అభ్యర్థులు మార్చి 5వ తేదీ వరకు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. మార్చి 6న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటే మార్చి 9వ తేదీ లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.
మార్చి 16వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ప్రస్తుత ఎంపీలు అభిషేక్ సింఘ్వీ, సురేష్ రెడ్డిల పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనుండటంతో ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







