శరణితో రవితేజ వివాహం
- October 20, 2015
తెలుగు చిత్ర పరిశ్రమతో సుదీర్ఘకాలంగా విస్తృతమైన సంబంధ బాంధవ్యాలు కలిగిన ప్రముఖ రాజకీయవేత్త-ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి మరియు విద్యాశాఖామాత్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు- ప్రముఖ విద్యావేత్త, నారాయణ విద్యాసంస్థల అధినేత, ఆంధ్రప్రదేశ్ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖామాత్యులు శ్రీ పొంగూరు నారాయణ వియ్యంకులు కాబోతున్నారు. శ్రీ గంటా శ్రీనివాసరావు-శ్రీమతి గంటా శారదల ఏకైక కుమారుడు చి॥రవితేజ వివాహం.. శ్రీ పొంగూరు నారాయణ దంపతుల కనిష్ట పుత్రిక చి॥ ల॥సౌ॥ శరణితో ఈనెల 30న నెల్లూరులో అంగరంగ వైభవంగా జరగనుంది. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీమన్మధనామ సంవత్సర ఆశ్వీయుజ బహుళ తదియ తత్కాల చవితి శుక్రవారం అనగా.. తేది 30-10-2015 రాత్రి గం॥ 10.25 ని॥లకు.. మృగశిర నక్షత్రయుక్త మిధున లగ్న శుభపుష్కరాంశ సుముహూర్తాన 'రవితేజ-శరణి'ల వివాహం జరిపించుటకు దైవజ్ఞులు నిర్ణయించినారు. నెల్లూరులోని "నారాయణ మెడికల్ కాలేజి క్యాంపస్" ఈ వివాహ మహోత్సవానికి వేదిక కానుంది. ఆరోజు రాత్రి 7 గం॥ల నుంచి విందు మొదలు కానుంది. నాలుగు రోజుల అనంతరం.. అనగా 4-11-2015 సాయంత్రం 7 గం॥ల నుంచి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటి ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్స్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ విచ్చేసి.. నూతన వధూవరులను ఆశీర్వదించి.. తమ ఆతిధ్యం స్వీకరించి.. తమను ఆనందింపజేయవసిందిగా గంటా శ్రీనివాసరావు మరియు పొంగూరు నారాయణ దంపతులు సవినయంగా ఆహ్వానిస్తున్నారు!!
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







