ఆస్ట్రేలియాలో అతిపొడవైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగ హైవే
- July 28, 2017
ఆటోమొబైల్ రంగం లోని కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహ నాల తయారీపైనే దృష్టి పెడుతు న్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహ నాల వినియోగం పెరగాలంటే ఇందుకు తగ్గ మౌలిక వసతులు కూడా పెరగాల్సి ఉంటుంది. ఇందుకోసం వివిధ దేశాలు ఆ దిశగా కృషి చేస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా తమ దేశంలో అతిపొ డవైన ఎలక్ట్రిక్ హైవేను రూపొంది స్తోంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన హైవేల్లో ఒకటని పేర్కొం టోంది. క్వీన్స్‌లాండ్ తీర ప్రాంతంలో 18 నగరాలను కలుపుతూ 2000 కి.మీ పొడవైన ఎలక్ట్రిక్ హైవేను రూపొందించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమవుతోంది. బ్రిస్బేన్ నుంచి టుల్లీ వరకూ భారీ ఖర్చుతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఈ హైవే పొడవునా వాహనాలు త్వరితగతిన ఛార్జింగ్ చేసుకునే స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఈ సదుపాయాల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న దని అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది. భవిష్యత్‌లో కారు కొనాలను కునే వారిలో సగం మంది ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నారని క్వీన్స్‌లాండ్‌లో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. దేశంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నప్పటికీ..
కొన్ని మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ హైవే నిర్మాణంతో ఆ కొరత తీరనుందని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







