రెండు యాలకులను బుక్కన వేసుకుని నమిలితే...
- July 28, 2017
సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లోని వంటింట్లో యాలకులు ఉంటాయి. వీటిని మసాలా కూరల్లో, స్వీటు ఐటమ్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కొందరైతే యాలకులు వేసిన ఛాయ్‌ను ఇష్టంగా తాగుతుంటారు. ఇలా కొన్ని వంటకాలకు మంచి రుచిని, సువాసనను అందిస్తాయి యాలకులు.
యాలకుల్లో సువాసనలే కాదు.. ప్రత్యేక ఔషధ గుణాలు ఉన్నాయట. యాలకుల్లో పొటాషియం, మ్యాగ్నీషియం వంటి పోషయాలు ఎన్నో ఉన్నాయి. ఇందులోని పొటాషియం గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతుంది. అలాగే రక్తపోటు సమస్య కూడా అదుపులో ఉంటుంది. యాలకుల్లోని పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్థక సమస్యను నివారిస్తుంది. ప్రతిరోజు పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో అరచెంచా యాలకుల పొడి, చిటికెడు పసుపు, కొద్దిగా చక్కెర వేసుకుని తాగితే రక్తహీనత తగ్గుతుంది. రక్తసరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది.
రోజూ రెండు యాలకులను బుక్కన వేసుకుని నమిలితే మంచి ఫలితం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. యాలుకలను నమిలితే నోటి దుర్వాసన పోయి చిగుళ్ళు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ రెండు యాలకులు తింటే శరీరంలోని హానికరమైన చెడు పదార్థాలు పోతాయి. అంతే కాదు ఎముకల బలానికి, శరీరానికి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. జుట్టు కూడా రాలదు. అంతేకాదు ఒత్తుగా జుట్టు కూడా వస్తుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!







