చికెన్ చాప్స్
- July 30, 2017
కావలసినవి: చికెన్- 800 గ్రాములు (8 ముక్కలుగా కట్ చేసుకోవాలి), కొత్తిమీర పేస్టు- ఒక టేబుల్‌స్పూను, పసుపు- అర టీస్పూను, మిరియాల పొడి- టీస్పూను, పచ్చిమిరపకాయలు-4, కారం-1/2 టీస్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు- 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ పేస్టు- ఒక కప్పు, టొమాటో గుజ్జు- ఒక కప్పు, ఉప్పు- తగినంత.
తయారీ విధానం: చికెన్ ముక్కలు తప్ప మిగతా పదార్థాలనన్నింటినీ ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఆ పేస్టును చికెన్ ముక్కలకు పట్టించి గంట సేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత పెద్ద పాన్‌లో సరిపడా నూనె పోసి అది వేడెక్కిన తర్వాత మంటను మీడియంలో పెట్టి నూనెలో ఒక్కొక్క చికెన్ ముక్క వేసి వేగించాలి. అలా ముక్కలన్నింటినీ దోరగా వేగించాలి. ఆ తర్వాత పాన్‌పై మూతపెట్టి మరో మూడు నిమిషాల పాటు దాన్ని ఉడకనివ్వాలి. ఇలా చేస్తే చికెన్ ముక్కలు మెత్తగా అయి వాటిల్లోని రసం ఆవిరైపోతుంది. అప్పుడు పాన్‌ని స్టవ్ మీద నుంచి కిందకు దించి ఉడికిన చికెన్ ముక్కలపై ముందుగా తరిగిపెట్టుకున్న కొత్తిమీర తరుగును చల్లి తింటే ఆ టేస్టే వేరు.
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







