నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మ్యూజియంలో విలువైన వస్తువు చోరీ

- July 30, 2017 , by Maagulf
నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మ్యూజియంలో విలువైన వస్తువు చోరీ

నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ మ్యూజియంలో ఓ విలువైన వస్తువు చోరీకి గురైంది. లూనార్‌ స్సేస్‌ మాడ్యూల్‌ బంగారు ప్రతిమను మ్యూజియం నుంచి దుండగులు ఎత్తుకెళ్లారు.
వాయువ్య ఒహైయోలోని వపకొనేట ప్రాంతంలో ఈ మ్యూజియం ఉంది. శుక్రవారం అర్ధరాత్రి మ్యూజియంలో అలారం మోగడంతో వెంటనే స్థానిక పోలీసులు, సిబ్బంది వచ్చి పరిశీలించారు. లూనార్‌ స్సేస్‌ మాడ్యూల్‌ బంగారు ప్రతిమ చోరీకి గురైందని గుర్తించారు. పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌తోపాటు మరో ఇద్దరు వ్యోమగాములకు గతంలో ఈ బంగారు ప్రతిమను బహుమతిగా అందించారు. 1969 జులైలో చంద్రునిపై కాలుమోపిన తొలి వ్యక్తిగా ఆర్మ్‌స్ట్రాంగ్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 82 ఏళ్ల వయసులో ఆర్మ్‌స్ట్రాంగ్‌ కన్నుమూశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com