వేర్పాటువాదుల వ్యవహారంలో ఎన్ఐఏకు కీలక సమాచారం
- July 31, 2017
జమ్ముకశ్మీర్ వేర్పాటువాదుల వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు కీలక ఆధారాలు లభించాయి. హురియత్ నేత సయ్యద్ అలీ షా గిలానీ విడుదల చేసిన అల్లర్లకు సంబంధించిన ఓ కాలెండర్ను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. కశ్మీర్లో ఏ యే రోజు ఎక్కడ అల్లర్లు జరపాలన్న వివరాలు అందులో ఉన్నాయి. గతేడాది జూలై8న హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత జరగాల్సిన అల్లర్లపై అందులో వివరంగా ఉంది. హురియత్ నేతలు నిర్దేశించిన ఈ కార్యాచరణకు అనుగుణంగానే భద్రతా బలగాలపై అల్లరిమూకలు రాళ్లదాడులు జరిపినట్టు అధికారులు చెబుతున్నారు. కశ్మీర్ లోయలో అశాంతి, అల్లర్లకు వేర్పాటు వాదులు ఎలా ఆజ్యం పోస్తున్నారన్నది ఈ కాలెండర్‌తో స్పష్టమైంది. హురియత్ నేతలకు పాకిస్తాన్ ఏజెన్సీల నుంచి ఫండ్ వస్తున్న విషయం ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగు చూసింది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









