ఫ్లిప్‌కార్ట్‌లో ఈ-బే ఇండియా విలీనం
- August 01, 2017
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ-బే ఇండియా విలీనం పూర్తయింది. ఇక నుంచి ఈబే.ఇన్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో భాగమని ఆ సంస్థ మంగళవారం వెల్లడించింది. గత ఏప్రిల్‌లోనే ఈ ఒప్పందం గురించి ప్రకటించగా.. నేడు చర్చలు పూర్తయినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
ఈక్విటీ స్టేక్ మార్పిడిలో భాగంగా.. ఈ-బే ఫ్లిప్‌కార్ట్‌లో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. దీంతో పాటు ఈ-బే ఇండియా బిజినెస్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించింది. ‘ఈ ఒప్పందంతో ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు మరిన్ని ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. ఈ-బే కస్టమర్లకు కొత్త అమ్మకందారులు లభిస్తారు’ అని ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా.. ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందానికి మరో ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ వెనుకడుగు వేసిన విషయం తెలిసిందే. 950 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేస్తామన్న ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌ను స్నాప్‌డీల్ తిరస్కరించింది. కంపెనీ విలువపై వచ్చిన భిన్నాభిప్రాయాల కారణంగా ఒప్పందం రద్దయింది. ఫ్లిప్‌కార్ట్‌తో చర్చలు నిలిపివేశామని, తాము స్వతంత్రంగానే సాగాలని నిర్ణయించుకున్నట్లు స్నాప్‌డీల్ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







