జర్మనీలో 1.86 కోట్ల మంది శరణార్థులు ఉన్నట్టు తాజా సర్వే
- August 02, 2017
ఫెడరల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం
జర్మనీ జనాభాలో కోటీ 86లక్షల మంది శరణార్థులు ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడయింది. ఫెడరల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం (ఎఫ్‌ఎస్‌ఓ) తెలిపిన వివరాల ప్రకారం...శరణార్థులకు ఆశ్రయం కల్పించడంలో జర్మనీ అగ్రస్థానంలో ఉన్నది. జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ శరణార్థులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఓపెన్ డోర్ పాలసీ సత్ఫలితాలను ఇచ్చింది. జర్మనీ ప్రస్తుత జనాభా 8కోట్ల 24లక్షలు. జనాభాలో 1.86కోట్ల మంది శరణార్థులను గుర్తించినట్టు ఎఫ్‌ఎస్‌ఓ తెలిపింది. 2015లో జర్మనీకి శరణార్థుల తాకిడి పెరగడంతోనే ఈ సంఖ్య నమోదైందని పేర్కొన్నది. 2014-16 మధ్య కాలంలో ఐరోపాలో ఆశ్రయం కోసం 16లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఎఫ్‌ఎస్‌ఓ తెలిపింది.23లక్షల మంది మధ్య ప్రాఛ్య దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించింది. ఏడు లక్షల మంది ఆఫ్రికా నుంచి వచ్చినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







