ఆలు దోస బజ్జీలు
- August 02, 2017
కావలసినవి: ఆలు 500 గ్రా., దోసకాయలు మీడియం సైజువి 2, మిరియాల పొడి 1/2 టీస్పూను, ఉప్పు తగినంత.
పూతపిండికి: శెనగపిండి 2 క ప్పులు, ఉల్లివిత్తనాలు ఒక టీ స్పూను, నూనె వేగించడానికి సరిపడా, ఉప్పు తగినంత.
తయారుచేసే విధానం
ఆలుగడ్డల్ని చెక్కుతీసి ఫోటోలో చూపిన విధంగా వెడల్పాటి ముక్కలుగా కోసిపెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో పది నిమిషాలు నానబెట్టి ఉంచాలి. తర్వాత నీళ్ళు ఒడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు వేడిచేసి దానిలో ఈ ముక్కలువేసి సగం ఉడికీ ఉడక్క ముందే దించేయాలి. మూడు నాలుగు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంచొద్దు. మళ్ళీ నీళ్ళన్నీ ఒడకట్టి మిరియాల పొడి చల్లి పక్కన ఉంచేయాలి. దోసకాయల చెక్కుతీసి సన్నగా తురుముకుని చేతులతో ఒత్తి నీళ్ళన్నీ పిండేయాలి.
శెనగపిండి, ఉప్పు, ఉల్లివిత్తనాలను కొంచెం నీళ్ళతో బజ్జీల పిండిలా కలుపుకోవాలి. నురుగు వచ్చేదాకా దాన్ని గిలకొట్టి దోసగుజ్జుని దానిలో బాగా కలిపేయాలి. ఇప్పుడు మూకుడు పెట్టి నూనె వేడిచేయాలి. ఆలుముక్కల్ని ఈ పిండిలో ముంచి మీడియం సెగపెట్టి వేగించాలి. రెండు వేపులా బ్రౌన్‌రంగు వచ్చేదాకా వేగించి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







