డేట్ చాక్లెట్ కాయిన్స్
- August 03, 2017
కావలసిన పదార్థాలు
ఎండు ఖర్జూరాలు- ఒక కప్పు, బెల్లం (పొడి చేసినది)- 1టీ స్పూన, బ్రెడ్ పొడి- 2 టీస్పూన్లు, ఎండుకొబ్బరి పొడి- 2 టీస్పూన్లు, నెయ్యి- 2 టీ స్పూన్లు, చెర్రీస్, కిస్‌మిస్, ఫ్రూటీ, గసాలు - 1 టీ స్పూను, జీడిపప్పు పలుకులు - 2 టీ స్పూన్లు, క్యాడ్‌బరీ చాక్లెట్ తురుము - 2 టీస్పూన్లు.
తయారీ విధానం
ముందుగా ఖర్జూర పండ్లలోని గింజలు తీసేసి, వాటిని పొడి చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో బెల్లంపొడి, బ్రెడ్‌పొడి, క్యాడ్‌బరీ తురుము, కిస్‌మిస్, జీడిపప్పు పలుకులు, గసాలు, ఫ్రూటీ, నెయ్యి అన్నీ వేసి చేతితో చపాతీ పిండి ముద్దలా బాగా కలపాలి. తరువాత దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, వాటిని బిళ్ళలుగా చేతితో వత్తుకోవాలి. ఈ బిళ్ళలకి రెండువైపుల కొబ్బరి పొడి అద్ది, పైన చెర్రీతో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే చాక్లెట్ డేట్ కాయిన్స రెడీ.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







