అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి యాంకర్లు గా సునీత,సాయికుమార్ ..!

- October 21, 2015 , by Maagulf
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి యాంకర్లు గా సునీత,సాయికుమార్ ..!

దసరా రోజున ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి శంకుస్థాపనకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. ఈ కార్యక్రమం జరిగే ఉద్దండరాయుని పాలెం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని మోదీతోపాటు విదేశాల నుంచి ప్రతినిధులు, బిజినెస్‌మేన్లు హాజరుకానున్నారు. ప్రత్యేక ఆకర్షణ కోసం సినీ హంగులు అద్దుతోంది ప్రభుత్వం. పాటలు, సంగీత కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకోనున్నాయి. సినీనటుడు సాయికుమార్, గాయని సునీత ఈ కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరిస్తారు. చారిత్రాత్మక ఘట్టానికి యాంకరింగ్ చేసే అవకాశం రావడం తమ అదృష్టమని సునీత, సాయికుమార్‌లు అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com