క్లిష్టమైన పరిస్థితిలో నావికుని భార్య

- August 04, 2017 , by Maagulf
క్లిష్టమైన పరిస్థితిలో నావికుని భార్య

నౌకలో సముద్రాలు చుట్టే ఆ నావికునికి కష్టాల కడలి జీవితంపై దిగులు కల్గిస్తుంది. అనారోగ్యం పాలైన తన భార్యను చూసేందుకు తన మాతృ దేశం వెళ్లేందుకు దీనంగా ఆ ప్రవాసీయుడు  ఎదురుచూస్తున్నాడు. శ్రీలంకకు చెందిన సెయిలర్ శాంతా రాజపక్సే(55) మనోవ్యధ అతడి మాటల్లోనే చెప్పాలంటే  "మూడు నెలలుగా నా ఇద్దరు పిల్లలు స్కూల్‌ కు వెళ్లడం లేదు. నా భార్య తన సోదరుల దగ్గర అప్పు చేసింది. దాన్ని ఎలా తీర్చాలో తెలియక దిగులుతో గుండెపోటు తెచ్చుకుంది. ఆ సమాచారం సైతం  నా స్నేహితుల ద్వారానే నాకు తెలిసింది. వారితో మాట్లాడే అవకాశం కూడా నాకు లేకుండాపోయింది. నా కంపెనీలో గత కొంతకాలంగా  జీతం ఇవ్వడం లేదు. నేను స్వదేశానికి వెళ్లిపోతానంటే నాకు బదులు మరో వ్యక్తిని పనిలో పెట్టి వెళ్లమంటున్నారు. అయిదు నెలల క్రితమే నా తండ్రి చనిపోయాడు. అప్పుడు నన్ను పంపలేదు." రాజపక్సే చెప్పిన మాటలివి. మార్చ్2016లో దుబాయ్ వెళ్లిన రాజపక్సే ఓ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీ నష్టాల్లో ఉందని సంవత్సరం నుంచి సరిగ్గా జీతం కూడా ఇవ్వడం లేదు. శ్రీలంకకు చెందిన ఆ కంపెనీ షిప్పు దుబాయ్ సముద్ర జలాల్లో సంవత్సర కాలంగా ఉంటోంది. ఆ షిప్పులో సెయిలర్‌గా రాజపక్సే విధులు నిర్వహిస్తున్నాడు. అయితే రాజపక్సేతో పనిచేసిన కొంతమంది భారతీయులను కంపెనీ ఇంటికి పంపేసింది. కానీ, రాజపక్సేను మాత్రం వెళ్లనివ్వడం లేదు.ఒక్కొసారి తిండి కూడా సరిగ్గాపెట్టకుండా కడుపు మాడ్చుతున్నారు.మార్చిలో తన దగ్గరున్న 10,000 దిర్హామ్స్ పంపించానని తరువాత నెల నుంచి ఒక్క పైసా కూడా పంపలేదని రాజపక్సే తెలిపాడు. ఆ మొత్తం కూడా తన తండ్రి వైద్యానికి, దహనసంస్కరాలకి ఖర్చయయ్యాని చెప్పాడు. సంవత్సరం నుంచి సముద్రానికే తన బాధను చెప్పుకుంటూ బతుకుతున్నానని వెంటనే తనను శ్రీలంకకు పంపించేయాలని కనపడిన ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాడు. తన భార్య ఐసీయూలో చికిత్స పొందుతుంటే తాను ఇక్కడ ఉండలేకపోతున్నానని అతడు చెబుతున్నాడు. తనను ఈ నరకం నుంచి తప్పించాలని కోరుతున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com