పామ్ జ్యూమరా విందు తర్వాత ఓ మహిళ పై క్రూరమైన అత్యాచారం
- August 04, 2017
ఉద్యోగం సద్యోగం లేని ఓ జులాయి చేసిన ఆగడమిది..ఎడారి దేశాలలో శిక్షలు తీవ్రమని తెల్సిన వంట్లో తీట పతనమయ్యేవరకు నడిపించింది. ఆ దుర్మార్గుడు స్నేహితుల బృందంతో కలిసి తనకు ఇటీవలే పరిచయమైన మహిళా స్నేహితురాలిని పామ్ జమ్మీరాలోని ఒక విలాసవంతమైన హోటల్లో విందుకు ఆహ్వానించాడు. భోజనం తర్వాత ఆ మహిళా ఉద్యోగిని బలవంతంగా అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ 29 ఏళ్ల ఎమిరాటీ నిందితుడు అల్బాషిరా అనే ప్రాంతంలో నివసిస్తున్న వివాహమై ఇద్దరు పిల్లలున్న ఒక 36 ఏళ్ల లెబనీస్ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఆ వ్యక్తి మర్యాదగానే మాట్లాడుతున్నాడని ఆమె కూడా అతడితో స్నేహం చేయడం మొదలుపెట్టింది. కానీ, అతడి మనసులో కామపిశాచి బుసలు కొడుతుందని ఆమె ఏమాత్రం గ్రహించ లేకపోయింది. సోమవారం ఆమెకు ఆశ్చర్య పోయే పార్టీ ఇస్తానంటూ హోటల్‌కి రమ్మన్నాడు. అక్కడ ఆమెపై లైంగికదాడి చేశాడు. ఆ సమయంలో అతడి స్నేహితుడు కూడా అక్కడే ఉన్నాడని ఆమె తెలిపింది. అతడు తనను గదిలోకి లాకెళ్లాడని తనను వదిలేయలని ఎంతగా ప్రాదేయపడిన విడిచిపెట్టలేదని లైంగికదాడి చేస్తుండగా అతడి స్నేహితుడు వీడియో తీశాడని ఆమె చెబుతోంది. విషయం బయటకు చెబితే వీడియోను సోషల్‌మీడియాలో పెడతానంటూ తనను బెదిరించాడంది. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గురువారం తన స్నేహితురాలు దైర్యం చెప్పి ఆమెను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసింది.దుబాయ్‌కి చెందిన ఆ వ్యక్తి నిరుద్యోగి అని అమ్మాయిలను మోసం చేస్తూ వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తూ జల్సాగా జీవితాన్ని గడుపుతాడని పోలీసుల విచారణలో తేలింది. లెబనాన్ నుంచి ఉద్యోగరీత్యా బాధితురాలు దుబాయ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. లైంగికదాడి తర్వాత ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడని అలా తనకు కావాల్సినప్పుడల్లా డబ్బులివ్వాలని ఆమె ఒత్తిడి కూడా చేశాడని పోలీసులు తెలిపారు. గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







