ఎమిరేట్స్ ఫ్లైట్ కేటరింగ్ సౌకర్యాల్ని పరిశీలించిన షేక్ మొహమ్మద్
- August 04, 2017
దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఎమిరేట్స్ ఫ్లైట్ కేటరింగ్ సౌకర్యాల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షేక్ మొహమ్మద్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సహా 120 ఎయిర్‌లైన్స్‌కి కేటరింగ్ విభాగం అందిస్తున్న సేవల్ని కొనియాడారు. సెంట్రల్ కమిస్సరీ యూనిట్, స్కైబేక్లను కూడా సందర్శించిన షేక్ మొహమ్మద్, అక్కడి పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. 9 టన్నుల పండ్లు, 15 టన్నుల కూరగాయలు, 30 టన్నుల మీట్‌ని రోజువారీ హ్యాండిల్ చేసే సత్తా సిసియుకి ఉంది. ఏడాదికి 3,300 టన్నుల ఫ్లోర్‌ని ఉపయోగించి 97 రకాలైన 4,50,00 ఐటమ్స్‌ని సరఫరా చేసే శక్తి స్కైబేక్ సొంతం. ఎమిరేట్స్ ఫ్లైట్ కేటరింగ్ 10,000 మందికి పైగా ఉద్యోగుల్ని కలిగి ఉంది. 50 దేశాలకు చెందినవారు ఇందులో పనిచేస్తున్నారు. షేక్ మొహమ్మద్ వెంట దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్ సహా పలువురు ప్రముఖులు ఈ టూర్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







