రాజీనామా కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నాడు
- August 04, 2017
భారతీయ వలసదారుడొకరు ఐర్లాండ్ నుంచి షార్జా వచ్చి, ప్రాణాలు కోల్పోయాడు. కారులో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆగస్ట్ 1 నుంచి ఆ వ్యక్తి కనిపించడంలేదని సంబంధీకులు పేర్కొంటున్నారు. షార్జాలో ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు ఆయన వచ్చాడని వారు చెప్పారు. కేరళలోని పెరంబవూర్‌కి చెందిన 35 ఏళ్ళ డిక్సన్, ఒమ్మిదేళ్ళుగా షార్జా ఎయిర్‌పోర్ట్ ఫ్రీ జోన్‌లో ఓ సంస్థలో పనిచేస్తున్నారు. అల్ కులయ్యా ప్రాంతంలో పార్క్ చేసిన కారులో డిక్సన్ మృతదేహం పోలీసులకు దొరికింది. డిక్సన్ మిస్సింగ్‌పై ఆగస్ట్ 1న ఫిర్యాదు అందుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు విచారణ కొనసాగుతుండగా, డిక్సన్‌ని విగతజీవిగా కనుగొన్నామని పోలీసులు వివరించారు. మృతదేహాన్ని అల్ కువైటి ఆసుపత్రికి తరలించారు. షార్జాలో ఉద్యోగానికి రాజీనామా చేసి, ఐర్లాండ్‌లో తన భార్యతో కలిసి ఉండాలనుకున్నాడనీ, ఈలోగా ఈ దారుణం జరిగిందని డిక్సన్ మరో స్నేహితుడు చెప్పారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







