ఇంట్లో గంజాయి వనం నిర్వహిస్తున్న బహ్రెయిన్ వ్యక్తి అరెస్టు
- August 04, 2017
మనామా: తులసి వనంలో ..గంజాయి మొక్క కాదు ...ఏకంగా పూల కుండీలలలో మత్తుని కల్గించే గంజాయి మొక్కలను ఏపుగా పెంచుతున్న ఓ బహ్రెయిన్ నిందితుడిని ఇటీవల అరెస్ట్ చేసినట్లు అధికారులు చెప్పారు. పనికిరాని ఆ పచ్చ"ధనం" ను నిలువరించినట్లు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ జనరల్ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్జిజి అల్ అల్మామిచే విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం 31 ఏళ్ల అనుమానితుడు అనేక గంజాయి మొక్కలను తన పెరటిలో పెంచుతున్నట్లు పేర్కొన్నారు. మొక్కలు, మరియు విత్తనాలను సస్య రక్షణ పద్దతులతో గంజాయి తోటను సంరక్షిస్తున్నట్లు ఆ అధికారి పేర్కొన్నాడు. గంజాయి కోతకు వచ్చిన తర్వాత ఆ కొమ్మలను ఆకులను నూర్చి వాటితో కుటీర పరిశ్రమ మాదిరిగా ఇంటివద్దనే మాదకద్రవ్యాలను తయారుచేస్తున్నారు. తయారుచేసే పరికరాలు పెద్ద మొత్తంలో డబ్బుని నిందితుని వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అనుమానితుడు మాదకద్రవ్యాల తయారీకి తగిన స్థలంని ఎంచుకొని మరియు చిన్న తరహా కుటీర పరిశ్రమ మాదిరిగా అక్కడ పర్యావరణాన్ని తయారుచేసినట్లు నిందితునిపై అన్ని సాక్ష్యాలు ఆధారాలు నిరూపించబడటంతో ఆ ప్రదేశాన్ని జప్తు చేశారు ఈ కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు పంపించబడినట్లు అల్ రూమికి తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







