హెల్త్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌: ఎన్‌హెచ్‌ఆర్‌సికి 161 అప్లికేషన్స్‌

- August 05, 2017 , by Maagulf
హెల్త్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌: ఎన్‌హెచ్‌ఆర్‌సికి 161 అప్లికేషన్స్‌

మనామా: 160కి పైగా అప్లికేషన్లు హెల్త్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఏర్పాటు కోసం ఎన్‌హెచ్‌ఆర్‌కి అందాయి. 2017 తొలి భాగంలోనే ఈ స్థాయిలో అప్లికేషన్స్‌ ఎన్‌హెచ్‌ఆర్‌ఎఇ చేరడం గమనించదగ్గ అంశం. నేషనల్‌ హెల్త్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌ఎ) సిఇఓ డాక్టర్‌ మరియమ్‌ అల్‌ జలాహ్మా ఈ విషయాన్ని ధృవీకరించారు. జనవరి నుంచి ఇప్పటిదాకా మొత్తం 161 అప్లికేషన్లను అందుకున్నట్లు తెలిపారాయన. ఇంకో వైపున ఎన్‌హెచ్‌ఆఎ 389 ఇన్‌స్పెక్షన్‌ విజిట్స్‌ హెల్త్‌కేర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌పై జరిగినట్లు డాక్టర్‌ జలాహ్మా చెప్పారు. ఆప్టీషియన్స్‌, డెంటిస్ట్‌లపైనా ఇన్‌స్పెక్షన్‌ విజిట్స్‌ జరిగాయి. ఈ సందర్బంగా 200 ఉల్లంఘనల్ని గుర్తించారు. 153 ఉల్లంఘనలు ఎపిడమిక్‌ ప్రివెన్షన్‌కి సంబంధించినవి కాగా, 76 డ్రగ్స్‌ స్టోరేజ్‌ ఉ్లలంఘనలు, 58 మెడికల్‌ వేస్ట్‌ డిస్పోజల్‌ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. పేషెంట్స్‌ సేఫ్టీకి సంబంధించి 60, సానిటేషన్‌కి సంబంధించి 86 ఉల్లంఘనలు నమోదయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com