భారత సైన్యం తో ముచ్చటించిన అక్షయ్ కుమార్
- August 10, 2017
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మంచి నటడు, మంచితనం, మానవత్వం ఉన్న వ్యక్తి. ముఖ్యంగా సైనికుల పట్ల అపార గౌరవం కలిగిన హీరో.. అనేక సార్లు సైనికుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించిన అక్షయ్ తాజాగా మరో సారి సైనికుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకొన్నాడు.. ఇండియా- చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న ఇండో-టిబెటన్ బోర్డర్ హెడ్ క్వార్టర్స్ ను అక్షయ్ సందర్శించాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సైనికులను, అధికారులను కలిశాడు. ఈ విషయం పై ఐటీబీపీ సీనియర్ అధికారి స్పందిస్తూ.. అవును అక్షయ్ ఇక్కడకు వచ్చి సైనికులను అధికారులను కలిశాడు.. సైన్యం పట్ల తనకున్న గౌరవాన్ని చాటాడు.. సైనికులు ఉపయోగించే ఆయుధాలు, ఇతర పరికరాలను స్వయంగా చూడడమే కాదు.. వాటి గురించి అనేక విషయాలను అడిగి తెలుసుకొన్నాడు.. అందరినీ ఆప్యాయంగా పలకరించి సైన్యం పడుతున్న కష్టాలను విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రమాదకరమైన ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో ఎటువంటి పరిస్తితులను ఎదుర్కొంటామో తెలియజేశాము.. అక్షయ్ ఎంతో ఓపికగా మా గురించి అడిగి తెలుసుకొన్నారు.. కాగా ఇదే విషయం పై అక్షయ్ స్పందిస్తూ.. ఎటువంటి ప్రతికూల వాతావరణం లోనైనా విధులు నిర్వహిస్తున్న సైనికుల కష్టం ఏమిటో నాకు తెలుసు.. చావును కూడా లెక్కచేయకుండా వారు చూపుతున్న పోరాటపటిమ అసాధారణం.. ఐటీబీపీ పోలీసులను కలవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది.. నేను సైన్యం ను కేవలం గౌరవభావంతోనే కలిశాను అంతేకాని మరో ప్రత్యేక కారణం లేదు అని అక్షయ్ తన ట్వీటర్ లో తెలిపాడు..
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు









