త్వరలో మామకు డైరెక్షన్ చెయ్యబోతున్న అల్లుడు
- August 11, 2017
ధనుష్ నటించిన 'వీఐపీ 2' శుక్రవారం తెరపైకి రానుంది. ప్రస్తుతం ఆయన గౌతంమేనన్ దర్శకత్వంలో 'ఎన్నై నోక్కి పాయుం తోట్టా' చిత్రంలో నటిస్తున్నారు. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో 'వడ చెన్నై'లోనూ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. ఈ రెండూ పూర్తయిన తర్వాత 'మారి 2' చిత్రంలో నటించనున్నారు ధనుష్. అంతేకాకుండా ఓ హాలీవుడ్ చిత్రంలోనూ నటించే అవకాశాన్ని చేజెక్కించుకున్నారు. ఇప్పటికే 'పవర్‌పాండి' సినిమాతో దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్నారు ధనుష్. అదే అనుభవంతో త్వరలోనే తన మామ, సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని చెబుతున్నారు. దీనిపై ధనుష్ మాట్లాడుతూ 'రజనీకాంత్ నటించే ఓ సినిమాకు దర్శకత్వం వహించాలన్నదే నా కోరిక. అందుకోసం ఏకంగా 15 కథలు సిద్ధం చేసుకున్నా. వీటన్నింటి వన్‌లైన్ సిద్ధంగా ఉంది. అవకాశం రాగానే ఆయనకు వీటిని తప్పకుండా వినిపిస్తా.
నటిస్తారనే నమ్మకం ఉంది. ప్రస్తుతానికి ఆయన సినిమా నిర్మాతగా మారడమే పెద్ద అదృష్టం' అని ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







