ఊరగాయలు అనారోగ్య సమస్యలు
- October 22, 2015
ఊరగాయలు చూడగానే ఆవురావురుమంటూ లాగించేస్తున్నారా ? రోజూ భోజనంలో ఊరగాయ ఉండాల్సిందేనా ? పికిల్ లేకపోతే ముద్ద దిగడం లేదా ? అయితే కాస్త ఆగండి. నోరూరించే ఊరగాయలు ఎక్కువగా తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఊరగాయలు సేవించడానికీ ఓ లిమిట్ ఉండాలని సూచిస్తున్నారు. ఊరగాయలు రుచికరంగా.. కారంగా.. తింటుంటే తినాలిపిస్తాయి. ఇండియాలో ఊరగాయలు లేకుండా.. భోజనం పరిపూర్ణం కాదు. అలాంటి వాటికి దూరంగా ఉండాలంటే కాస్త కష్టమే కానీ.. కొన్ని నియమాలు పాటిస్తే.. ఊరగాయల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోజుకి ఎంత మొత్తంలో పచ్చళ్లు తినాలో తెలుసుకుంటే.. రుచితో పాటు.. ఆరోగ్యంగానూ ఉండవచ్చు. పచ్చళ్లు అంటేనే నిల్వ పదార్థాలు. ఇవి ఎంతకాలమైనా.. రుచిగా ఉండటానికి.. నిల్వ ఉండటానికి ఇందులో నూనె ఎక్కువ వాడతారు. ప్యాక్ చేసిన పచ్చళ్లు పాడవకుండా ఉండటానికి నూనెతోపాటు ఉప్పు, వెనిగర్ ఎక్కువ మోతాదులో కలుపుతారు. ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. నూనెతో పాటు కారం, ఉప్పు ఊరగాయలలో ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ట్రైగ్లిజరైడ్ ల స్థాయిలు శరీరంలో పెరుగుతాయి. ఇవి ఎక్కువైతే.. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి పచ్చళ్లకు దూరంగా ఉండటమే మేలు. నిత్యం ఊరగాయలు తీసుకునే వాళ్లు కాస్త జాగ్రత్త వహించాలి. ఎక్కువగా పచ్చళ్లు తినే వాళ్లలో ఉదరంలో నొప్పి, పిత్తాశయ సమస్యలు పెరుగుతాయి. పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. జీర్ణాశయ సమస్యలు తీవ్రమవుతాయి. కొన్ని సందర్భాలలో విరేచనాలకు కారణమవుతాయి. పచ్చళ్ల ద్వారా ఎక్కువ మొత్తంలో సోడియం తీసుకుంటే.. శరీరానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ నీటి శాతం అందించాల్సి వస్తుంది. ఊరగాయలు ఎక్కువగా తీసుకుంటే.. బీపీ కూడా పెరుగుతుంది. ఆకస్మికంగా బ్లడ్ ప్రెషర్ పెరిగడం.. దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కారం ఎక్కువగా ఉండే పచ్చళ్లు అల్సర్లకు కారణమవుతాయి. ఊరగాయలను నిత్యం తీసుకునే వాళ్లకు పొట్టలో, పేగులలో అల్సర్ సమస్య మొదలవుతుంది. మొలల సమస్యలున్న వాళ్లు సాధ్యమైనంతవరకు పచ్చళ్లకు దూరంగా ఉండాలి. రోజూ ఆహారంలో ఊరగాయలు చేర్చుకోవడం వల్ల.. మొలల సమస్య పెరిగే అవకాశం ఉంది. ఇందులో కారంతో పాటు ఘాటు పదార్థాలు ఉండటం వల్ల పైల్స్ మరింత తీవ్రమవుతాయి. తినడానికి రుచికరంగా.. చూడ్డానికి నోరూరించేలా ఉండే పచ్చళ్లు ఎక్కువగా తింటే.. ఆరోగ్యానికి హానికరం. కాబట్టి మితంగా తీసుకోండి. కావాలంటే నూనె, ఉప్పు, కారం తగ్గించి.. ఊరగాయలను తయారు చేసుకుని తినాలి. రోజూ తినాలి అనిపిస్తే.. తక్కువ పరిమాణంలో తీసుకోండి. అప్పుడు.. రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికీ ఎలాంటి ముప్పూ ఉండదు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







