నాగార్జున చిత్రం వచ్చే ఏడాది మొదటి వారం లో రిలీజ్
- October 22, 2015
అక్కినేని నాగార్జున , తమిళ్ హీరో కాంబినేషన్ లో ఒకేసారి తెలుగు - తమిళ భాషల్లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం 'ఊపిరి'. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో రాబోతున్న ఈ చిత్రం తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇంకా ఒక నెల రోజుల షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. ప్రస్తుతం నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా' షూటింగ్ లో బిజీగా ఉండడం వలన ఊపిరి సినిమాకి బ్రేక్ ఇచ్చారు. తాజా సమాచారం ఈ నెల చివరిన షూటింగ్ ని మొదలు పెట్టి నవంబర్ చివరికల్లా పూర్తి చేయనున్నారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి మరో నెల రోజుల సమయం పడుతుంది. ముందుగా ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్న షూటింగ్ ఆలస్యం కావడం వల్ల వచ్చే ఏడాది మొదటి వారం లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ చిత్ర రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటన చేయనున్నారని వార్త. నాగార్జున ఈ సినిమాలో ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు. ఈ సినిమాలో వీరితో పాటు ఓ ముఖ్య పాత్రలో అనుష్క - అడవి శేష్ జంటగా కనిపించనున్నారు. విపి బ్యానర్ పై పి.వి.పి నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







