ఖమ్మంలో పైసా వసూల్
- August 13, 2017
బా లకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'పైసా వసూల్'. శ్రియ, ముస్కాన్, కైరాదత్ కథానాయికలు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మాత. సెప్టెంబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నెల 17న ఖమ్మంలో పాటల విడుదల వేడుకని నిర్వహించబోతున్నారు. అదే రోజునే ట్రైలర్‌ని కూడా విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. నిర్మాత మాట్లాడుతూ ''ముందుగా ప్రకటించిన విడుదల తేదీ కంటే, నెల రోజులు ముందుగానే మా 'పైసా వసూల్' విడుదలవుతోంది. బాలకృష్ణతో ఆ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఆయన వేగం, పూరి జగన్నాథ్‌లోని స్పష్టత వల్లే ఇంత ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన స్టంపర్‌కి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి. అందుకు దీటుగానే చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు.
బాలకృష్ణ నటన, పూరి జగన్నాథ్ సినిమాని తీర్చిదిద్దిన విధానం సినిమాకి ప్రధాన ఆకర్షణ. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన గీతాలు అందరినీ అలరించనున్నాయి'' అన్నారు. కబీర్ బేడితో పాటు అలీ, పృథ్వీ, పవిత్రా లోకేష్, విక్రమ్ జిత్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







