మరో క్షిపణి ప్రయోగం చేసిన ఉ.కొరియా

- August 13, 2017 , by Maagulf
మరో క్షిపణి ప్రయోగం చేసిన ఉ.కొరియా

అమెరికా, ఉ.కొరియాల మధ్య తలెత్తిన సంఘర్షణలు ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగానికి సిద్దమయ్యేందుకు ఆజ్యం పోస్తోంది. ఉత్తర కొరియా జలాంతర్గామి ఆధారిత బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాలకు సిద్దమవుతున్నట్లు ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా బహిర్గతమైంది. ఇప్పటికే తనవద్ద ఉన్న జలాంతర్గాములను నవీకరించేందుకే ఉ.కొరియా ఈ ప్రయోగాలకు సిద్దమవుతుందని సైనిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈక్రమంలోనే గతేడాది ఆగష్టులో విజయవంతంగా ప్రయోగించిన పగ్‌గుక్‌సంగ్‌-1 క్షిపణిని నవీకరించేందుకే మళ్లీ ఈ జలాంతర్గామి క్షిపణిని తాజాగా మరోమారు ప్రయోగించిందని సైనిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూలైలో ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్యాంగాంగ్‌ను ప్రయోగించటంతోనే అమెరికాతో పాటు దక్షిణ కొరియా, జపాన్‌లు ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. ఉత్తరకొరియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తమవద్ద లోడింగ్‌ చేయబడిన శక్తివంతమైన క్షిపణులు సిద్దంగా ఉన్నాయని వాటిని ప్రయోగించేందుకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరికలు పంపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com