వాయిదా పడ్డ 'యుద్ధం శరణం'

- August 13, 2017 , by Maagulf
వాయిదా పడ్డ 'యుద్ధం శరణం'

ప్రేమమ్ , రారండో వేడుక చూద్దాం సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్న అక్కినేని నాగ చైతన్య తాజాగా యుద్ధం శరణం మూవీ తో రాబోతున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 24 ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించినప్పటికీ తాజాగా ఆ డేట్ కు సినిమా రావట్లేదని సమాచారం. రెండు వారాలు ఆలస్యంగా సెప్టెంబరు 8న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారట. సినిమా షూటింగ్ అంత పూర్తి అయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఆ సమయానికి సినిమా రిలీజ్ చేయడం కష్టమవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆగస్టు 24 నుంచి 'యుద్ధం శరణం' వెళ్లిపోవడం 'అర్జున్ రెడ్డి'కు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com