భారీ ఎన్కౌంటర్ లో హతమైన టాప్ హిజ్బుల్ కమాండర్
- August 13, 2017
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా షోపియన్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో భద్రతా దళాల చేతుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతి చెందిన ఉగ్రవాదుల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ యాసిన్ యాతూ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులు-ఆర్మీ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు భారత సైనికులు కూడా అమరులు అయ్యారు. షోషియన్ జిల్లాలోని అన్వీరా గ్రామంలో శనివారం సాయంత్రం ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల ఏరివేతతో ఆదివారం ఉదయం తెల్లవారుజామున ముగిసింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







