నేరేడు పండ్లతో చౌకగా సౌర కణాలు
- August 13, 2017
నోరూరించే నేరేడు పండ్లతో సౌర కణాలను తయారుచేయవచ్చని ఐఐటీ రూర్కీ పరిశోధకులు వెల్లడించారు. తక్కువ ఖర్చుతో సౌర కణాలను తద్వార సౌర ఫలకలనూ రూపొందించవచ్చని తెలిపారు. ఈ పండ్లలో సహజంగా లభించే పిగ్మెంట్ కాంతి గ్రాహకంగా పనిచేస్తుందని వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌమిత్ర శతపతి వివరించారు. నల్లగా, నిగనిగలాడే వీటి రంగుకు కాంతిని ఒడిసిపట్టే గుణం ఉందని, వీటితో డై సెన్సిటైజ్డ్ సోలార్ సెల్స్(డీఎ్సఎ్ససీ)ను అతితక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చని పేర్కొన్నారు. సాధారణంగా ఈ పిగ్మెంట్లను కృత్రిమంగా రుథేనియంతో తయారుచేస్తారని, అయితే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







