దుబాయ్ అంబులెన్స్ లో ఆటోమేటెడ్ సి పి ఆర్ పరికరం ఏర్పాటు

- August 13, 2017 , by Maagulf
దుబాయ్ అంబులెన్స్ లో  ఆటోమేటెడ్ సి పి ఆర్ పరికరం ఏర్పాటు

 దుబాయి కార్పొరేషన్ అంబులెన్స్ సర్వీసెస్ (డిసిఎఎస్) కు చెందిన  అత్యవసర వాహనాల్లో ఒకదానిలో ఆటోమేటెడ్ హృదయ స్పందన తెలియచేసే రిసస్పటిషన్ పరికరాన్ని ఏర్పాటుచేశారు . ఆ తర్వాత మిగిలిన అత్యవసర వాహనాలపై సైతం ఆ పరికరాలను అమర్చనున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవస్థాపించాలన్న చొరవతో  గుండె మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సహాయం చేస్తుందని అత్యవసర అధికారులు చెప్పారు. డిసిఏయస్ వద్ద ఆపరేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ టాలిబ్ గులూమ్ మాట్లాడుతూ, గుండెపోటుతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారి జీవితాన్ని రక్షించే అవకాశం ఆ  సంఘటనను చూసిన మొదటి వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. ఏ ఒక్కరైనా అకస్మాత్తుగా గుండెపోటుని ఎదుర్కోవచ్చని, ప్రతి నిమిషం గడిచేసేసరికి ఆ కాలం వారిని  రక్షించబడే అవకాశాలను మెరుగుపరుస్తుంది. కాబట్టి, సమయం అనేది గుండెపోటుతో బాధ పడుతున్నవారి జీవితం రక్షించబడటమా  లేదా మరణించడమా అని అర్ధమవుతుందని ఆయన తెలిపారు. ఒక రోగి యొక్క మెదడు మరియు గుండె తగినంత ఆక్సిజన్, రక్తాన్నిఆరు నిమిషాల లోపున అందకుండా ఉంటె ఆ రోగి   మనుగడ సాధ్యం కాదని  దుబాయి కార్పొరేషన్ అంబులెన్స్ సర్వీసెస్ (డిసిఎఎస్) మెడికల్ అండ్ టెక్నికల్ అఫైర్స్ డైరెక్టర్  డాక్టర్ ఒమర్ అల్ సక్కాఫ్ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com