గట్టే కి భెండి

- August 13, 2017 , by Maagulf
గట్టే కి భెండి

 కావలసినవి 
గట్టేల కోసం: బెండకాయలు: అరకిలో, సెనగపిండి: పావుకిలో, 
పసుపు: అరటీస్పూను, దనియాలపొడి: అరటీస్పూను,
కారం: అరటీస్పూను, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత,
జీలకర్ర: టీస్పూను, అల్లంతురుము: టీస్పూను, పుదీనా: టీస్పూను, 
బేకింగ్‌సోడా: పావుటీస్పూను, పెరుగు: కప్పు, నూనె: తగినంత
కూర కోసం: నెయ్యి: టేబుల్‌స్పూను, నూనె: టేబుల్‌స్పూను,
పచ్చిమిర్చి: ఐదు, జీలకర్ర: అరటీస్పూను, ఉల్లిపాయ: ఒకటి,
లవంగాలు: 8, వెల్లుల్లిరెబ్బలు: ఆరు, పసుపు: అరటీస్పూను,
కారం: ముప్పావు టీస్పూను, దనియాలపొడి:
అరటీస్పూను, ఇంగువ: పావుటీస్పూను, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కొద్దిగా
తయారుచేసే విధానం 
* బెండకాయల అంచుల్ని తుంచి విడిపోకుండా మధ్యలోకి చీల్చాలి. బాణలిలో జీలకర్ర వేయించి పొడి చేయాలి.
* ఓ గిన్నెలో ఓ రెండు టేబుల్‌స్పూన్ల సెనగపిండి, మసాలా దినుసులు, జీలకర్రపొడి వేసి కలపాలి. అల్లంముద్ద, పుదీనా ఆకుల తురుము కలపాలి. చీల్చిన బెండకాయల్లో ఈ మిశ్రమాన్ని పెట్టాలి.
* విడిగా ఓ గిన్నెలో పెరుగు వేసి అందులో సెనగపిండి, బేకింగ్‌ సోడా వేసి జారుగా కలపాలి. 
* ఇప్పుడు స్టఫ్‌ చేసిన బెండకాయల్ని ఈ పిండి మిశ్రమంలో ముంచి కాగిన నూనెలో వేయించి తీయాలి. 
* ఓ పాన్‌లో టేబుల్‌స్పూను నూనె, టేబుల్‌స్పూను నెయ్యి వేయాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిముక్కలు వేసి వేగాక లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఓ నిమిషం వేగనివ్వాలి.
* పసుపు, దనియాలపొడి, ఇంగువ, కారం, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు పోయాలి. ఇందులో, బెండకాయల్ని ముంచి తీయగా మిగిలిన పెరుగు- సెనగపిండి మిశ్రమాన్ని వేసి సిమ్‌లో ఉడికించాలి. చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసి, నూనె తేలుతుండగా, వేయించిన  బెండకాయల్ని వేసి కొత్తిమీర చల్లి సిమ్‌లో ఐదు నిమిషాలు ఉడికించి దించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com