హజ్ కు అనుమతి లేని 95,000 మంది యాత్రికులు వెనక్కి పంపివేత

- August 15, 2017 , by Maagulf
హజ్ కు అనుమతి లేని  95,000 మంది యాత్రికులు వెనక్కి పంపివేత

అధికార హజ్ అనుమతిలను చూపడంలో విఫలమైనందుకు 95,000 మందికి పైగా ప్రజలను మక్కా మరియు పవిత్ర స్థలాలలో యాత్రికుల ప్రవేశాన్ని నియంత్రించడానికి నియమించబడిన హజ్ భద్రతా దళాలు వెనక్కి పంపించారు. హజ్ సెక్యూరిటీ ఫోర్సెస్ కమాండర్, జనరల్ ఖాలిద్ అల్ మాట్లాడుతూ, జూలై 20 వ తేదీ  ఆగస్టు 12 వ తేదీ మధ్యకాలంలో మక్కాలో వివిధ ప్రాంతాలలో ప్రవేశించాలని ప్రయత్నించిన 95,400 మందిని అనుమతించలేదని చెప్పారు. హజ్ ప్రశాంత వాతావరణాన్ని భంగపరిచే విధంగా ఆయా నియమాలను ఉల్లంఘించిన వారిని సహించబోమని ఆయన అన్నారు. హజ్ యాత్రకు ఎటువంటి అనుమతి లేకుండా ప్రవేశిస్తున్నవారు అనధికార హజ్జీలను వారిని అక్రమ  రవాణా చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తారు. సూచించబడిన జరిమానాలను అందుకు సంబంధించిన అధికారులు నిర్ణయిస్తారని చెప్పారు. మక్కా ప్రవేశద్వారం వద్ద భద్రతా జాగ్రత్తలు మరియు పవిత్ర స్థలాలకు దారితీసే రహదారులు మరియు పవిత్ర స్థలాల ప్రవేశద్వారం వద్ద నిఘా కెమెరాలు అమర్చబడ్డాయని యాదృచ్ఛిక వేలిముద్ర తనిఖీల ద్వారా పవిత్ర స్థలాలలో హాజ్ నియమాలను ఉల్లంఘించినవారిని  సెక్యూరిటీ దళాలు గుర్తిస్తున్నాయి. పౌరులు, నివాసితులు మరియు భద్రతా అధికారుల మధ్య సహకారంతో చట్టబద్ధమైన హాజ్ యాత్రికులకు తగిన వాతావరణాన్ని కల్పించే   ప్రాముఖ్యతను అల్-హర్బి వివరింఛారు. హజ్ అనుమతిని పొందడంతో పాటు అక్కడ అమలయ్యే వివిధ నిబంధనలకు అనుగుణంగా హజ్ చేయాలని యాత్రికులను ఆయన కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com